విజయవాడలో వైభవంగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’

October 17, 2026 0 Comments

ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విజయవాడ: సంప్రదాయ సంస్కృతికి ఆధునిక హంగులు అద్దుతూ, నగర ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ వేడుకలు విజయవాడలో అత్యంత అట్టహాసంగా ముగిశాయి. వైబ్ ఈవెంట్స్, ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ వేగా జ్యువెలర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సాంస్కృతిక సంబరానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ …

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవం

October 10, 2026 0 Comments

▪️ ముఖ్య అతిథులుగా సినీ నటులు రాజీవ్ కనకాల, వితికా షేరు..▪️ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ హైదరాబాద్ (మణికొండ): సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు మణికొండలో ఘనంగా జరిగాయి. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, మంచి విలువలను అలవర్చే లక్ష్యంతో గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ ఏడాది ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకలు సందడిగా సాగాయి. సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర …

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకున్న ‘వేదవ్యాస్’ చిత్రబృందం!

September 22, 2026 0 Comments

సాయిప్రగతి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత, మాజీ శాసనసభ్యుడు, KPRIT విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు స్వై (ఎస్.వి.) కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేదవ్యాస్’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా యూనిట్ సభ్యులు మంగళవారం ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, సమర్పకులు కె. అచ్చిరెడ్డి, కథానాయకుడు పిడుగు విశ్వనాథ్, సహ …

ప్రపంచ NRIలను ఏకం చేసే మాస్టర్ ప్లాన్.. గురురాజా వ్యూహం ఇదే!

September 20, 2026 0 Comments

హైద‌రాబాద్: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశారు. మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, బాధ్యతలు, ప్రవాసాంధ్రుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్రపై కీలక వివరాలను వెల్లడించారు. నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా, విదేశాల్లో వెర్వేరుగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాలను ఒకే గొడుగు …

గురురాజా మాస్టర్ ప్లాన్.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీకి కొత్త దిశ..!

September 20, 2026 0 Comments

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడం.. వారి సమస్యలకు అండగా నిలవడం.. పెట్టుబడులు, సేవా కార్యక్రమాలకు మార్గం సుగమం చేయడం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలను భాగస్వాములుగా మార్చడం.. ఇదే లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా తెలిపారు. మహా న్యూస్ సీఎండీ మర్రెల వంశీకృష్ణతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గురురాజా.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఏర్పాటుకు కారణాలు, తనకు అప్పగించిన బాధ్యతలు, ప్రవాసాంధ్రుల సమస్యలు, …

వి.వి. సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: కూకట్‌పల్లి కోర్టు కీలక ఆదేశాలు

September 13, 2026 0 Comments

▪️ అసోసియేషన్ నిధులకు రక్షణ▪️ సెప్టెంబర్ 13న జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని కూకట్‌పల్లి నిలిపేసిన కోర్టు▪️ నిబంధనల ప్రకారం రఘు మాస్టర్‌పై సుమలత విజయం చెల్లుబాటు అవుతుందని స్పష్టం▪️ రఘు మాస్టర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్న వార్తలను తోసిపుచ్చిన‌ సంఘం▪️ కొత్త సభ్యుల నమోదు ప్రక్రియను కొనసాగిస్తామన్న‌ సంఘం అధ్యక్షురాలు వి.వి. సుమలత దేవి హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న వివాదం న్యాయస్థానానికి చేరింది. సెప్టెంబర్ 13న …

అంతర్జాతీయ స్థాయిలో సూర్యాపేట బిడ్డ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన పురస్కారం

September 5, 2026 0 Comments

— చిలీలోని UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్‌టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ అవార్డు సాధించిన డా. ప్రవీణ్ బర్మావతు— ఘనంగా సత్కరించిన యూనివర్సిటీ రెక్టర్ మారిసోల్ డురాన్ శాంటిస్ కోదాడ/శాంటియాగో: సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చి, అంతర్జాతీయ పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్ బర్మావతుకు విదేశీ గడ్డపై అరుదైన పురస్కారం లభించింది. సౌత్ అమెరికా దేశమైన చిలీలోని ‘యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా’ (UTEM) ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో …

టీచర్స్‌ డే కానుకగా ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ ఫస్ట్ లుక్!

September 5, 2026 0 Comments

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఆవిష్కరణ హైదరాబాద్‌: జాతీయ అవార్డు గ్రహీత నవీన్‌ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్‌’ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తుండగా.. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి తాత పాత్రలో, సత్యం రాజేష్‌ పాఠశాల ఉపాధ్యాయుడిగా కీలక పాత్రలు …

మహిళా ప్రొడక్షన్ వర్కర్స్ అధ్యక్షురాలు లలితపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

September 4, 2026 0 Comments

తెలుగు సినీ, టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో తీవ్ర అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. యూనియన్ అధ్యక్షురాలు లలితపై పలువురు మహిళా కార్మికులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లో అత్యవసర మీడియా సమావేశం నిర్వహించి అధ్యక్షురాలి వైఖరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన విషయాలు & ఆరోపణలు:ఆర్ధిక పారదర్శకత లోపం: సభ్యులు ఏడాదికి ₹5,000 చొప్పున చందా చెల్లిస్తున్నారని, గత పదేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయ-వ్యయాల వివరాలు, యూనియన్ ప్రాపర్టీ (ఆస్తులు) …

ఎంఎస్ వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణంలో హీరోగా ఫోక్ స్టార్ కిట్టు పవన్.. క్లాప్ కొట్టిన ఆస్కార్ విజేత చంద్రబోస్!

August 29, 2026 0 Comments

ఫోక్ స్టార్ కిట్టు పవన్ కథానాయకుడిగా యం.ఎస్‌. వారాహి క్రియేషన్స్‌, శివమ్‌ మీడియా సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 3) శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శివమ్ మీడియా కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ముని శివ, శివమల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌ సాయి నాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ జానపద గేయాలతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. అంగరంగ …