సాయిప్రగతి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత, మాజీ శాసనసభ్యుడు, KPRIT విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు స్వై (ఎస్.వి.) కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేదవ్యాస్’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా యూనిట్ సభ్యులు మంగళవారం ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, సమర్పకులు కె. అచ్చిరెడ్డి, కథానాయకుడు పిడుగు విశ్వనాథ్, సహ …