ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న ‘వేదవ్యాస్’ చిత్రబృందం!
సాయిప్రగతి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత, మాజీ శాసనసభ్యుడు, KPRIT విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు స్వై (ఎస్.వి.) కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వేదవ్యాస్’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా యూనిట్ సభ్యులు మంగళవారం ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, సమర్పకులు కె. అచ్చిరెడ్డి, కథానాయకుడు పిడుగు విశ్వనాథ్, సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొని గణేశుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ వినాయక మండప నిర్వాహకులకు నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు.

అనంతరం మీడియా సమావేశంలో చిత్రబృందం మాట్లాడిన విశేషాలు:
నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి: “మా ‘వేదవ్యాస్’ చిత్రబృందమంతా కలిసి ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గారు సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం.”
దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి: “మా టీమ్‌తో కలిసి గణేశుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ప్రజలందరికీ, మన సమాజానికి ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
చిత్ర సమర్పకులు కె. అచ్చిరెడ్డి: “ప్రస్తుత సమాజ పరిస్థితులు, ట్రెండ్‌కు అనుగుణంగా కృష్ణారెడ్డి గారు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ఆ గణపతి ఆశీస్సులతో సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.”
హీరో పిడుగు విశ్వనాథ్: “ఈనాటి జెన్-జీ (Gen-Z) యూత్‌కి కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో కూడా మన వేదాలు, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పే కథాంశమిది. మొదటి సినిమానే ఎస్.వి. కృష్ణారెడ్డి గారి వంటి దిగ్గజ దర్శకుడితో చేసే అవకాశం రావడం ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహమే. వచ్చే ఏడాదికల్లా నన్ను మంచి నటుడిగా, పెద్ద హీరోగా నిలబెట్టాలని ఆ మహా గణపతిని ప్రార్థించాను.”
